ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో ముగిసిన సూచీలు వారాంతంలో నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదనే వార్తలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించాయి.
ఆసియా మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 535 నష్టపోయి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా, రిలయన్స్, సిప్లా, సన్ ఫార్మా, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో ఉన్నాయి. ఎనర్జీ, ఫార్మా రంగాలు మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
డాలర్ మారకంతో రూపాయి 40 పైసలు పడిపోయి 76.46 వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 76.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత 76.47కు పడిపోయింది. చివరకు 76.46 వద్ద క్లోజ్ అయింది. క్రితం క్లోజింగ్ కంటే 40 పైసలు పడిపోయింది. గురువారం 76.06 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications