సెన్సెక్స్ 435 పాయింట్లు పతనం, 18,000 దిగువకు నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, పవర్ సూచీలు 1 శాతం నుండి 3 శాతం చొప్పున లాభపడగా, బ్యాంక్ సూచీలు 1 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కో శాతం క్షీణించాయి. మార్కెట్లు నిన్నటి వరకు రెండు పర్యాయాలు మంచి లాభాల్లో ముగిశాయి. నేడు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే బాటలో పయనించాయి. సోమవారం నాటి భారీ ర్యాలీ నేపథ్యంలో సూచీలు నేడు స్థిరీకరణ దిశగా సాగాయి. కీలక కంపెనీల్లో ఇన్వెస్టర్లకు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. గతవారంతో పోలిస్తే చమురు ధరలు ఈ రోజు పెరిగాయి. ఇది ఆసియా మార్కెట్ పైన ప్రభావం చూపి, సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ఉన్నాయి.

సెన్సెక్స్ నేడు 60,786 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,786 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,067 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 435 పాయింట్లు నష్టపోయి 60,176 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 17,957 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా కన్స్యూమర్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, HDFC, కొటక్ మహీంద్రా, రిలయన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications