537 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్: ఐటీ, ఫైనాన్షియల్స్ ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి
స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 27) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు ఇంట్రాడేలో ఏ దశలోను కోలుకోలేదు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేశాయి. మిశ్రమ కార్పోరేట్ ఫలితాలు, ఫెడ్ వడ్డీ రేటు పెంపు, యూరోపియన్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసే అవకాశముందనే వార్తలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. చైనాలో కరోనా కేసులు పెరగడం, మన దేశంలోను కేసులు కారణమయ్యాయి.
పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలను బలంగా కిందకు లాగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 56,983.68 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,079.03 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,584.04 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 537 పాయింట్లు నష్టపోయి 56,819 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 800 పాయింట్ల మేర పతనమైంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకొని 537 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.

ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, బజాజ్ ఆటో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications