మార్కెట్ లాభాలకు బ్రేక్: సెన్సెక్స్ 214 పాయింట్లు డౌన్, నిఫ్టీ బిలో 17,100
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(సెప్టెంబర్ 1) నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో ఉంటూ నిన్నటి వరకు ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకిన సూచీలు నేడు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నేడు సెన్సెక్స్ 57,763.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,918.71 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,263.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 214.18 (0.37%) పాయింట్లు నష్టపోయి 57,338.21 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 17,185.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,225.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,055.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 55.95 (0.33%) పాయింట్లు నష్టపోయి 17,076.25 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
వరుస లాభాల్లో దూసుకెళ్తున్న మార్కెట్లకు నేడు బ్రేక్ పడింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గతకొన్ని రోజుల బుల్ పరుగు నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లుగా కనిపిస్తోంది. దీంతో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, HDFC, HDFC బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లు నష్టపోవడం సూచీలపై భారీ ప్రభావం చూపింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.09 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో సగానికి పైగా షేర్లు నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, నెస్ట్లే, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ పిన్ సర్వ్, టీసీఎస్, HDFC, ఇన్ఫోసిస్, HCL టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ షేర్లు అదరగొట్టాయి. మెటల్, ఐటీ సూచీలు ఒక్కో శాతం చొప్పున లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాల్టీ సూచీలు ఒక శాతం నుండి ఐదు శాతం చొప్పున లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications