మార్కెట్ లాభాలకు బ్రేక్, నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (ఆగస్ట్ 18) నష్టాల్లో ముగిశాయి. నిన్నటి వరకు వరుస లాభాల్లో కొనసాగి, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డును తాకిన సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ, చివరకు నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం సమయం వరకు లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు ఒకటి గంట తర్వాత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ నిన్న 55,792 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 160 పాయింట్లకు పైగా క్షీణించి 55,630 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు ఓ దశలో 56,000 పాయింట్లను దాటింది. ఆరంభమే 56,073తో కనిపించింది. ఆ తర్వాత 56,118 పాయింట్లకు కూడా చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 162.78 (0.29%) నష్టపోయి 55,629.49 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16,701.85 పాయింట్లను తాకింది. చివరకు నిఫ్టీ 45.75 (0.28%) పాయింట్లు నష్టపోయి 16,568.85 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడంతో బుధవారం నాటి ట్రేడింగ్ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. నిఫ్టీ 16,600 దిగువన ముగిసింది. నిఫ్టీలో హిండాల్కో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐచర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి. FMCG, ఫార్మా, PSU బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో నేడు ఐచర్ మోటార్స్ 2.94 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.60 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.09 శాతం, అదానీ పోర్ట్స్ 1.84 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.83 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 2.21 శాతం, కొటక్ మహీంద్రా 2.16 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.84 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.83 శాతం, టాటా మోటార్స్ 1.46 శాతం లాభపడ్డాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, HDFC బ్యాంకు, బజాజ్ ఫిన్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications