భారీ లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు, సెన్సెక్స్ 366 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమై, చివరకు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలకు భిన్నంగా మార్కెట్లు ఉదయం లాభాల్లో కనిపించినప్పటికీ, మధ్యాహ్నం గం.12.30 తర్వాత నుండి నష్టాల్లోకి వెళ్ళింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 55,469 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ నేడు ప్రారంభంలోనే దాదాపు 500 పాయింట్లు ఎగిసి 55,931 పాయింట్ల వద్ద ఆరంభించింది. కానీ ఏ సమయంలోను 56,000 మార్కును మాత్రం అందుకోలేదు.
సెన్సెక్స్ 55,921.44 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,996.62 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,931.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,723.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,768.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,442.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 366 పాయింట్లు నష్టపోయి 55,102 పాయింట్ల వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు క్షీణించి 16,498 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది.

ఆటో, బ్యాంకు స్టాక్స్ భారీగా నష్టపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, విప్రో, టెక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, HDFC లైఫ్, శ్రీ సిమెంట్స్, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications