స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మార్చి 4) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాల్లో ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుంది. అయితే నష్టం కాస్త తగ్గింది కానీ, భారీ నష్టాలను మాత్రం తప్పించుకోలేకపోయింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ, జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రం పైన దాటడి వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల పవనాలు జత కలిశాయి. దీంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడే కనిష్టాల నుండి మధ్యాహ్నం కోలుకున్నప్పటికీ పూర్తి లాభాల్లోకి మాత్రం రాలేదు. చమురు పెరుగుదల, ద్రవ్యోల్భణ భయాలు సూచీల నష్టాలకు మరింత కారణమయ్యాయి.

ఐటీ మినహా అన్నీ నష్టమే
దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఒక ఐటీ మాత్రమే కాస్త సానుకూలంగా కనిపించింది. ఆటో, మెటల్స్, పవర్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ స్టాక్స్ రెండు శాతం నుండి మూడు శాతం చొప్పున నష్టపోగా, బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలు 2.3 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 1.6 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ వరుసగా మూడో రోజు నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి 76.16 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 22 పైసలు క్షీణించింది. బీఎస్ఈ టాప్ 30 స్టాక్స్‌లో ఎనిమిది మాత్రమే లాభాల్లో ముగియగా, మిగతా స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

768 పాయింట్ల నష్టాల్లో
సెన్సెక్స్ 54,653.59 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,013.27 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,887.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,339.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,456.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,133.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ చివరకు 768.87 పాయింట్లు నష్టపోయి 54,333.81 పాయింట్ల వద్ద, నిఫ్టీ 252.70 పాయింట్లు క్షీణించి 16,245.35 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.
భారత మార్కెట్‌లో ఇన్వెస్టర్లు గత మూడువారాల్లో ఎంత మేర ఆస్తిని కోల్పోయారో తెలుసా? అక్షరాలా ఉక్రెయిన్ జీడీపీ కంటే ఎక్కువ. ఫిబ్రవరి 24వ తేదీ నుండే సెన్సెక్స్ 3000 పాయింట్లు నష్టపోయింది. అంతకుముందు ఫిబ్రవరి 16కు ముందు కూడా మార్కెట్ నష్టాలు ఉన్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫిబ్రవరి 16న రూ.2,62,18,594 కోట్లు. ఈ కాలంలో భారత మార్కెట్లు రూ.15 లక్షల కోట్లు నష్టపోయారి. ఇది ఉక్రెయిన్ జీడీపీ కంటే ఎక్కువ. ఉక్రెయిన్ జీడీపీ 2021లో 171 బిలియన్ డాలర్లు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications