స్టాక్ మార్కెట్‌లు బుధవారం (మే 25) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కనిపించాయి. మధ్యాహ్నం గం.11.40 తర్వాత నష్టాల్లోకి వెళ్లిన సూచీలు, ఆ తర్వాత ఏ క్షణంలోను కోలుకోలేదు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్వల్ప నష్టాల్లో కనిపించిన సూచీలు, మధ్యాహ్నం తర్వాత మాత్రం భారీగా నష్టాల్లోకి వెళ్లి, చివరకు అదే స్థాయిలో ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 54,254.07 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,379.59 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,683.16 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,196.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,223.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,006.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 303.35 (0.56%) పాయింట్లు నష్టపోయి 53,749.26 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99.35 (0.62%) పాయింట్లు క్షీణించి 16,025.80 పాయింట్ల వద్ద ముగిసింది.

బ్యాంకింగ్ రంగం మినహా మిగతా అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 1 శాతం నుండి మూడు శాతం మేర క్షీణించాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, HDFC లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, భారతీ ఎయిర్ టెల్, HDFC ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, టీసీఎస్, యూపీఎల్ ఉన్నాయి. ఐటీ సూచీలు 3 శాతం క్షీణించగా, మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications