అతి భారీ నష్టాల నుండి భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్!
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 15) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుండి ప్రతికూలంగానే కదిలాయి. ప్రారంభంలో 850 పాయింట్ల మేర భారీగా నష్టపోయినప్పటికీ, చివరకు కాస్త కోలుకొని 400 పాయింట్ల నష్టంతో ముగిసింది. మధ్యాహ్నం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ కీలక 50,000 మార్కును, నిఫ్టీ 15వేల మార్కును కోల్పోయాయి. డాలర్ మారకంతో రూపాయి 72.47 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.

ఓ సమయంలో 1000 పాయింట్లు పడిపోయి
సెన్సెక్స్ ఓ సమయంలో ఏకంగా 50వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని, ఆ మార్కు పైన ముగిసింది. 50,773.47 పాయింట్ల వద్ద ప్రారంభమై సెన్సెక్స్ 50,834.78 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,799.83 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం ఓ సమయంలో దాదాపు 1000 పాయింట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ 397.00 (0.78%) పాయింట్లు నష్టపోయి, 50,395 వద్ద ముగిసింది. నిఫ్టీ 101.45 (0.67%) పాయింట్లు కోల్పోయి 14,929 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 2.60 శాతం, టెక్ మహీంద్రా 2.33 శాతం, టాటా స్టీల్ 2.28 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.86 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 1.56 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 2.88 శాతం, హీరో మోటో కార్ప్ 2.58 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.47 శాతం, కోల్ ఇండియా 2.39 శాతం, గెయిల్ 2.25 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.67 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.54 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.47 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.88 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.24 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.03 శాతం, నిఫ్టీ మీడియా 1.44 శాతం, నిఫ్టీ ఫార్మా 1.31 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.40 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.08 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.56 శాతం, నిఫ్టీ మెటల్ 1.04 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.16 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.02 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications