ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 28) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపట్లోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఉదయం పది గంటల లోపు నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సూచీలు నష్టాల్లోనే ఊగిసలాటలో కనిపించాయి. గతవారం 30 షేర్ సెన్సెక్స్ 580 పాయింట్లు లేదా 1.10 శాతం లాభపడి ముగిసింది. నేడు మాత్రం నష్టాల్లో ముగిసింది.

సూచీలు నష్టాల్లో..
నిఫ్టీ PSB బ్యాంకు, ఫార్మా, మెటల్ సూచీలు 1 శాతం నుండి 2 శాతం లాభపడ్డాయి. ఐటీ, ఎనర్జీ, ఇన్ఫ్రా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున ఎగిశాయి. సెన్సెక్స్ 189.45 (0.36%) పాయింట్లు నష్టపోయి 52,735.59 పాయింట్ల వద్ద ముగిసింది. 53,126.73 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 53,126.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,673.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 45.65 (0.29%) పాయింట్లు నష్టపోయి 15,814.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15,915.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,915.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,792.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, ూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.79 శాతం, హిండాల్కో 1.70 శాతం, టాటా స్టీల్ 1.61 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.55 శాతం, టెక్ మహీంద్రా 1.43 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 4.10 శాతం, టైటాన్ కంపెనీ 1.47 శాతం, టీసీఎస్ 1.30 శాతం, శ్రీ సిమెంట్స్ 1.18 శాతం, కోల్ ఇండియా 1.04 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.29 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 50.57 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ మెటల్ 1.28 శాతం, నిఫ్టీ ఫార్మా 1.27 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.04 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.01 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.33 శాతం, నిఫ్టీ ఐటీ 0.49 శాతం, నిఫ్టీ మీడియా 0.64 శాతం నష్టపోయాయి.స
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications