ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(జూన్ 23) లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ, చివరి గంటలో అంతకంతకూ పతనమైంది. రోజంతా నష్టాల్లోనే ఊగిసలాడి చివరకు 280 పాయింట్లుకు పైగా క్షీణించి క్లోజ్ అయింది సెన్సెక్స్. నిఫ్టీ 15,700 దిగువన ముగిసింది. చివరలో కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో పూర్తిగా నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా సూచీలు గరిష్ఠస్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపారు.
ఆటో రంగంలో లభించిన కొనుగోళ్ల మద్దతు ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో ఆవిరి కావడం నష్టాలకు కారణంగా మారింది. చివరకు సెన్సెక్స్ 282.63 (0.54%) పాయింట్లు నష్టపోయి 52,306.08 వద్ద, నిఫ్టీ 85.80 (0.54%) పాయింట్లు నష్టపోయి 15,686.95 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.24 వద్ద నిలిచింది.

నేటి టాగ్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.30 శాతం, టైటాన్ కంపెనీ 1.45 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.24 శాతం, ఓఎన్జీసీ 1.07 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.87 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.26 శాతం, విప్రో 2.95 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.50 శాతం, JSW స్టీల్ 1.44 శాతం, లార్సన్ 1.33 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications