ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల నష్టాలను నమోదు చేసింది. ఇటీవల చాన్నాళ్లకు 50వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ నేడు మళ్లీ 49,000 దిగువకు పడిపోయింది. ఉదయం నుండి నష్టాల్లోనే ఉన్న సూచీలు అంతకంతకూ పతనమయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్, కరోనా కేసులు పెరుగుతుండటం, మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపాయి. వారాంతం కావడంతో ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. నిఫ్టీ నిన్న 15,000 మార్కును తాకినప్పటికీ నేడు కీలక 14,700 దిగువకు పతనమైంది.

సెన్సెక్స్ 983 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ 49,360.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,569.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,698.08 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 49,765.94 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు సెన్సెక్స్ 983.58 (1.98%) క్షీణించి 48,782.36 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,747.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,855.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,601.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 263.80 (1.77%) పాయింట్లు నష్టపోయి 14,631.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్జీసీ 3.94 శాతం, కోల్ ఇండియా 3.90 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.87 శాతం, గ్రాసీమ్ 3.78 శాతం, ఐవోసీ 2.19 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 4.68 శాతం, HDFC బ్యాంకు 4.09 శాతం, ICICI బ్యాంకు 3.37 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 3.11 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.95 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, JSW స్టీల్, HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 1.77 శాతం, మిడ్ క్యాప్ 0.60 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.61 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.77 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.88 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.03 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.13 శాతం, నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ మీడియా 0.36 శాతం, నిఫ్టీ మెటల్ 0.15 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.04 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.83 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.35 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా 1.28 శాతం లాభపడింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications