భారీ లాభాల నుండి భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల మేర నష్టపోగా, నిఫ్టీ 14,600 మార్క్ దిగువన ముగిసింది. అమెరికా బాండ్స్ వడ్డీరేట్లు పెరగుతుండడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో సూచీలు వరుసగా అయిదో సెషన్ నష్టాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.53 వద్ద ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ 585.10 (1.17%) పాయింట్లు నష్టపోయి 49,216 పాయింట్ల వద్ద, నిఫ్టీ 163.45 (1.11%) పాయింట్లు క్షీణించి 14,557.85 పాయింట్ల వద్ద ముగిసింది. 50,161.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,296.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,962.36 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 14,855.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,875.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,478.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ITC 3.35 శాతం, బజాజ్ ఆటో 2.66 శాతం, హిండాల్కో 1.65 శాతం, గ్రాసీమ్ 1.51 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.04 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్ 4.02 శాతం, ఇన్ఫోసిస్ 3.60 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.29 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.12 శాతం, హీరో మోటో కార్ప్ 2.61 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఐటీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి.


Click it and Unblock the Notifications