స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ఉదయం (మంగళవారం, 20) సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్షీణించాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేసింది. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయంచడంతో మార్కెట్లలో ఉదయం ఉత్సాహం కనబడింది. అయితే మధ్నాహ్నం తర్వాత ఆవిరయ్యాయి. అదే సమయంలో నిన్నటి భారీ నష్టాల కారణంగా కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు దిగిన ఇన్వెస్టర్లు కాసేపటికి ప్రారంభంలోని లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు కరోనా కేసులు తగ్గకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బకొట్టింది. దీంతో సూచీలు పతనమయ్యాయి.

ఆరంభ లాభాలు ఆవిరి
సెన్సెక్స్ ఉదయం 48,473.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,478.34 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,438.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 243.62 (0.51%) పాయింట్లు క్షీణించి 47,705.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,526.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,526.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,207.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 63.05 (0.44%) పాయింట్లు పతనమై 14,296.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభంలో భారీ లాభాల్లో ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి క్షీణించి, ఆరంభ నష్టాలు ఆవిరయ్యాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.80 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.69 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.99 శాతం, HDFC లైఫ్ 2.89 శాతం, బజాజ్ ఆటో 2.43 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 4.75 శాతం, HCL టెక్ 3.35 శాతం, HDFC 3.07 శాతం, గ్రాసీమ్ 2.48 శాతం, శ్రీసిమెంట్స్ 2.45 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.44 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.43 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.03 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.31 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.09 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 1.37 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.21 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.22 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ మీడియా 3.05 శాతం, నిఫ్టీ మెటల్ 0.42 శాతం, నిఫ్టీ ఫార్మా 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.32 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications