సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జనవరి 25) భారీ నష్టాల్లో ముగిశాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుంది. దీనికి తోడు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపింది. అలాగే, దేశీయ అతిపెద్ద కంపెనీ, లిస్టెడ్ కంపెనీల్లో హెవీ వెయిట్ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దారుణంగా పతనమైంది. ఈ స్టాక్ ఏకంగా 5.58 శాతం నష్టపోయి రూ.1935 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో రూ.2050 వద్ద ముగిసింది. నేడు రూ.114కు పైగా పడిపోయింది.

సెన్సెక్స్ భారీ పతనం

సెన్సెక్స్ భారీ పతనం

సెన్సెక్స్ 530.95 పాయింట్లు లేదా 1.09% నష్టపోయి 48,347.59 పాయింట్ల వద్ద, నిఫ్టీ 133.00 పాయింట్లు లేదా 0.93% పతనమై 14,238.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 915 షేర్లు లాభాల్లో, 2009 షేర్లు నష్టాల్లో ముగియగా, 152 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 72.90 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 72.95 వద్ద ప్రారంభమైంది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 6.55 శాతం, UPL 3.74 శాతం, సిప్లా 3.53 శాతం, హీరోమోటో కార్ప్ 2.96 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.16 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 5.30 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 4.94 శాతం, HCL టెక్ 3.89 శాతం, టాటా మోటార్స్ 3.53 శాతం, ఐచర్ మోటార్స్ 3.47 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ఫైనాన్స్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ దారుణంగా పతనమైంది. ఏకంగా రూ.5.58 శాతం లేదా రూ.114కు పైగా నష్టపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి గాను ఫలితాల్లో పెట్రోరసాయనాల విభాగం ఆదాయం 30 శాతం వరకు పడిపోవడంతో ఈ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి.

రంగాలవారీగా

రంగాలవారీగా

నిఫ్టీ 50 స్టాక్స్ 0.93 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.97 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.78 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.82 శాతం, నిఫ్టీ ఎఫ్ంఎంసీజీ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 1.76 శాతం, నిఫ్టీ మీడియా 0.60 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.74 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.78 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.12 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ ఫార్మా 1.71 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.10 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.01 శాతం, నిఫ్టీ మెటల్ 0.15 శాతం లాభపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+