ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్ట్ 14) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం మంచి లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు, చివరలో ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ 38వేల దిగువకు, నిఫ్టీ 11,200 దిగువకు వచ్చాయి. సెన్సెక్స్ 433.15 పాయింట్లు(1.13%) నష్టపోయి 37,877.34 వద్ద, నిఫ్టీ 122.10 పాయింట్లు(1.08%) పడిపోయి 11,178.40 పాయింట్ల వద్ద ముగిసింది. 1,085 షేర్లు లాభాల్లో, 1,600 షేర్లు నష్టాల్లో ముగియగా, 133 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. కేవలం ఫార్మా, మెటల్ రంగాలు మినహా అన్ని రంగాల్లో నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం నుండి 1 శాతం మధ్య నష్టపోయాయి.

లాభాలకు 'ఆటో' బ్రేక్.. కారణాలివే..
ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగతా అన్ని నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఆటో స్టాక్స్ ప్రారంభ లాభాలకు బ్రేక్ వేశాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లు 2.5 శాతం వరకు క్షీణించాయి. దీంతో వరుసగా మూడో రోజు నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం వంటి కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యమంగా బ్యాంకింగ్, ఆటో షేర్లు పడిపోయాయి. సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 600 పాయింట్లకు పైగా పడిపోయి చివరకు 433 పాయింట్ల నష్టంతో ముగిసింది. టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, సిప్లా, ఎన్టీపీసీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ ఉన్నాయి.

బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో దేశీయ కరెన్సీ రూపాయి 74.90 వద్ద ముగిసింది. డొమెస్టిక్ మార్కెట్లో అమ్మకాలు జోరు ప్రభావం చూపింది. ఉదయం 74.80 వద్ద ప్రారంభమైంది. అయితే చివరలో అమ్మకాల ప్రభావంతో స్వల్పంగా క్షీణించింది. క్రితం సెషన్‌లో 74.84 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 74.74 నుండి 74.92 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 74.90 వద్ద క్లోజ్ అయింది.

లాభం.. నష్టం..
ఈ వారంలో సెన్సెక్స్ 0.4 శాతం, నిఫ్టీ 0.3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మీడియా 4.8 శాతం, నిఫ్టీ మెటల్ 3.9 శాతం ఎగిశాయి. నిఫ్టీ బ్యాంకు 0.3 శాతం క్షీణించగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.7 శాతం ఎగిసింది. నిఫ్టీ ఫార్మా 2.6 శాతం, నిఫ్టీ ఆటో 1.6 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.6 శాతం ఎగిసిపడగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.2 శాతం, నిఫ్టీ ఇన్ఫ్రా 0.3 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ 0.6 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.7 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం పడిపోయాయి. నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యు టాప్ గెయినర్ అయితే టాప్ లూజర్ ఐచర్ మోటార్స్, మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్ ఎల్గీ ఈక్విప్, టాప్ లూజర్స్ అలోక్ ఇండ్.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications