ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య కదలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు నేటితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో చివరికి లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టం వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఇక అమెరికాకు సంబంధించిన కీలక డేటా విడుదల కానుండటంతో ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న లాభపడ్డాయి.

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 51,128.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,282.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,891.66 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 97.70 (0.19%) పాయింట్లు ఎగిసి 51,115.22 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,323.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,384.55 వద్ద గరిష్టాన్ని, 15,272.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 36.40 (0.24%) పాయింట్లు లాభపడి 15,337.85 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 3.65 శాతం, ఎస్బీఐ 2.82 శాతం, విప్రో 2.59 శాతం, కొటక్ మహీంద్రా 2.10 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.07 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 2.29 శాతం, ఐవోసీ 1.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.54 శాతం, ఓఎన్జీసీ 1.32 శాతం, HUL 1.17 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC, SBI, టాటా స్టీల్, రిలయన్స్, BPCL ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.24 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.71 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.58 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.18 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.16 శాతం, నిఫ్టీ ఐటీ 1.14 శాతం, నిఫ్టీ మీడియా 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.77 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.85 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.85 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.13 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.01 శాతం, నిఫ్టీ ఫార్మా 0.19 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.19 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications