భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: ఆల్ టైమ్ గరిష్టానికి సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(మే 28) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 51,500 పాయింట్లను దాటి ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. నిఫ్టీ 15,500 సమీపంలో ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను నింపింది. కరోనా రోజువారీ కేసులు నేడు 44 రోజుల కనిష్ఠానికి చేరుకోవడం కూడా కలిసి వచ్చింది. పైగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సంక్షోభం నుండి బయటపడేందుక స్థానిక ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాలను ప్రవేశపెడుతుండం కలిసి వస్తోంది. దేశీయంగా రిలయన్స్ వంటి కొన్ని కీలక కంపెనీలు షేర్లు రాణించాయి.

లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 51,381.27 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,529.32 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,258.69 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 307.66 (0.60%) పాయింట్లు ఎగిసి 51,422.88 పాయిట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,421.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,469.65 వద్ద గరిష్టాన్ని, 15,394.75 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం 97.80 (0.64%) పాయింట్లు లాభపడి 15,435.65 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్ 6.01 శాతం, గ్రాసీమ్ 3.41 శాతం, అదానీ పోర్ట్స్ 3.29 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.08 శాతం, కోల్ ఇండియా 1.63 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 4.25 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.48 శాతం, శ్రీసిమెంట్స్ 1.46 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.41 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.41 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, సన్ ఫార్మా, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.64 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.35 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.13 శాతం నిఫ్టీ ఎనర్జీ 1.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.22 శాతం, నిఫ్టీ మీడియా 1.47 శాతం, నిఫ్టీ మెటల్ 0.25 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.67 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.32 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.21 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 1.18 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications