For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ భారీ పతనం, రెండు రోజుల్లో రూ.7.7 లక్షల కోట్ల సంపద ఫట్

|

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం దారుణంగా పతనమైన సూచీలు, ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. కానీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నానికి నేటి కనిష్టాల నుండి మాత్రం కోలుకున్నాయి. అయితే అమ్మకాలు కొనసాగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు సూచీలపై ప్రభావం చూపాయి.

సెన్సెక్స్ ఉదయం 54,188 పాయింట్లు క్షీణించి 54,795 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,918 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 365 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 54,470 పాయింట్ల వద్ద, 109 పాయింట్లు లేదా 0.67 శాతం నష్టపోయి 16,301 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 77.46 వద్ద ముగిసింది.

 Nifty ends at 16,300, Sensex down 365 points

బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం చొప్పున క్షీణించాయి. పవర్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, నెస్ట్లే, ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్ ఉన్నాయి. కాగా, గత రెండు సెషన్‌లలో ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్లు రెండు నెలల కనిష్టానికి పడిపోయింది.

English summary

మార్కెట్ భారీ పతనం, రెండు రోజుల్లో రూ.7.7 లక్షల కోట్ల సంపద ఫట్ | Nifty ends at 16,300, Sensex down 365 points

India's benchmark indices ended lower Monday but off low, largely led by losses in index heavyweight RIL.
Story first published: Monday, May 9, 2022, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X