వరుసగా మూడు రోజుల పాటు భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు పరుగు తీశాయి. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 830 పాయింట్ల వరకు లాభపడింది. ఏ సమయంలోను నష్టాల్లోకి జారుకోలేదు. కనీసం నిన్నటి ముగింపును కూడా తాకలేదు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అంతకంతకూ లాభపడి, మధ్యాహ్నం తర్వాత మరింత పుంజుకున్నాయి. టెక్నాలజీ, ఐటీ, టెలికాం, రియాల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ భయాలు వెంటాడినప్పటికీ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. వరుస నష్టాల కారణంగా కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలపడి 74.43 వద్ద ముగిసింది. స్ట్రేయిట్ టైమ్స్, జకర్తా కాంపోజిట్ మినహా ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి.

సూచీ పరుగు
సెన్సెక్స్ నేడు 60,248.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,750.72 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,997.96 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,977.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,123.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,905.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 767.00 (1.28%) పాయింట్లు ఎగిసి 60,686.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 229.15 (1.28%) పాయింట్లు లాభపడి 18,102.75 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేటి సెషన్‌లో 750 పాయింట్ల మే పైకి కిందకు కదలాడింది.

ఈ స్టాక్స్ భారీగా జంప్
నేడు పలు స్టాక్స్ పదిహేను శాతం మేర లాభపడ్డాయి. జొమాటో, దేవ్యానీ స్టాక్స్ పరుగు పెట్టాయి. దేవ్యానీ ఇంటర్నేషనల్ 15 శాతం మేర లాభపడి రూ.168.40 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 9 శాతం లాభపడి రూ.160 వద్ద ముగిసింది. ఈ కంపెనీ ఆగస్ట్ 16న మార్కెట్‌లోకి వచ్చింది. జొమాటో 12 శాతం మేర లాభపడింది. ఈ స్టాక్ రూ.153 వద్ద ముగిసింది. నేడు ఐటీ, పవర్, రియాల్టీ స్టాక్స్ అదరగొట్టాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 4.14 శాతం, హిండాల్కో 3.22 శాతం, HDFC 2.88 శాతం, విప్రో 2.84 శాతం, ఇన్ఫోసిస్ 2.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో 3.06 శాతం, టాటా స్టీల్ 0.95 శాతం, హీరో మోటో కార్ప్ 0.66 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.27 శాతం, ఐవోసీ 0.26 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, టాటా మోటార్స్, రిలయన్స్ ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications