దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమై, ఆద్యంతం అదే ఒరవడితో కొనసాగి, చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఎలాంటి ప్రతికూల వాతావరణం లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. అలాగే, గతవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుండి కిందకు వచ్చాయి. చైనాలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రభావం అంతగా కనిపించలేదు.
సెన్సెక్స్ ఉదయం 57,814.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,001.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,639.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,297.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,343.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,235.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 350.16 పాయింట్లు ఎగిసి 57,943.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103.30 లాభపడి 17,325.30 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, HDFC ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఐటీసీ ఉన్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్ నాటికి రూ.2.60 లక్షల కోట్లు క్రాస్ చేసింది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే నష్టపోయాయి. ఫార్మా, రియాల్టీ 1 శాతం చొప్పున, క్యాపిటల్ గూడ్స్ 0.65 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications