గత రెండు వారాలుగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, నేడు (సోమవారం, 1 నవంబర్) భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలతకు తోడు దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు ఈ వారం ప్రారంభంలో స్వల్పంగా తగ్గడం కూడా కలిసి వచ్చింది. డాలర్ మారకంతో రూపాయి ఇటీవల స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్ పరుగుకు పలు అంశాలు కలిసి వచ్చాయి.

జీఎస్టీ వసూళ్లు సహా ఇవి జంప్
నవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ కలెక్షన్‌లలోనే ఇది సెకండ్ బెస్ట్. ఆర్థిక రికవరీ వేగంగా పుంజుకుంటోందని చెప్పడానికి ఈ కలెక్షన్స్ నిదర్శనం. దీనికి తోడు అక్టోబర్ నెలలో తయారీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కనిపించాయి. ఇవి మార్కెట్‌ను ముందుకు నడిపించాయి.

సెన్సెక్స్ భారీగా జంప్
సెన్సెక్స్ నేడు 59,577.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,220.21 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,355.12 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 831.53 (1.40%) పాయింట్లు ఎగిసి 60,138.46 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43, కనిష్టం 39,334.92. ఇక నిఫ్టీ 17,783.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,954.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,697.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 258.00 (1.46%) పాయింట్లు లాభపడి 17,929.65 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 7.80 శాతం, హిండాల్కో 3.99 శాతం, HCL టెక్ 3.97 శాతం, భారతీ ఎయిర్టెల్ 3.96 శాతం, గ్రాసీమ్ 3.95 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో UPL 2.72 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.57 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.43 శాతం, నెస్ట్లే 0.32 శాతం నష్టపోయాయి.

ఈ స్టాక్స్ భారీగా జంప్
నేడు స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. అయితే కొన్ని స్టాక్స్ ఏకంగా 15 శాతం లాభపడ్డాయి. అందులో వాల్‌చాంద్ పీపుల్ (20.0%), పంచమల్ స్టీల్ (19.97%), ఒడెస్సీ టెక్ (19.93%), గాలా గ్లోబల్ ప్రోడక్ట్స్ (19.85%), ప్రిసిషన్ వైర్స్ (18.68%), SKP సెక్యూరిటీస్ (17.65%), స్టార్ లైన్ ప్రీసియస్ (15.53%), క్రియేటివ్ కాస్టింగ్ (15.28%) ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications