ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(ఆగస్ట్ 17) లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2010 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడింది. ఐటీ స్టాక్స్ అండతో సూచీలు నేడు సరికొత్త రికార్డును తాకాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 56,000 పాయింట్లకు 146 పాయింట్ల దూరం వరకు వెళ్లింది. చివరకు 209.69 (0.38%) పాయింట్లు లాభపడి 55,792.27 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 51.55 (0.31%) పాయింట్లు ఎగిసి 16,614.60 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 55,565.64 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 55,854.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,386.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,545.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,628.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,495.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నేడు ఐటీ స్టాక్స్ సూచీలకు బలం ఇవ్వగా, మెటల్ స్టాక్స్ కిందకు లాగాయి. నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు 1 శాతం నుండి 2.5 శాతం మేర లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంకు, మెటల్ స్టాక్స్ ఒక్కొక్కటి రెండు శాతం మేర నష్టపోయాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 3.82 శాతం, విప్రో 3.40 శాతం, టెక్ మహీంద్రా 3.35 శాతం, నెస్ట్లే 2.39 శాతం, HUL 2.37 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్ 2.28 శాతం, అదానీ పోర్ట్స్ 2.02 శాతం, టాటా మోటార్స్ 1.98 శాతం, కోల్ ఇండియా 1.94 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.84 శాతం నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి 74.33 వద్ద నిలిచింది.

మిడ్ క్యాప్ లూజర్స్‌లో వొడాఐడియా, జేఎస్పీఎల్, సెయిల్, కెనరా బ్యాంకు, నాల్కో ఉన్నాయి. డివిడెండ్ షెడ్యూల్‌కు సంబంధించి హింద్ జింక్ డిఫర్ కావడంతో వేదాంత పది శాతం క్షీణించింది. ఎల్ అండ్ టీ, ఎంఫయాసిస్, మైండ్ ట్రీ, జుబిలాంట్ ఫుడ్, ఎస్ఆర్ఎఫ్ అండ్ కుమ్మిన్స్ టాప్ మిడ్ క్యాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 4 శాతం మేర లాభపడింది. ఫలితాల అనంతరం అపోలో హాస్పిటల్స్ భారీగా లాభపడింది. కొత్త రికార్డుకు చేరుకుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రెండు శాతం, టాటా స్టీల్ 1 శాతం నష్టపోయింది. బజాజ్ ఫిన్, బజాజ్ ఫిన్ సర్వ్ ప్రారంభంలో నష్టపోయినప్పటికీ, చివరకు లాభాల్లోకి వచ్చాయి. నిఫ్టీ బ్యాంకు 227 పాయింట్లు నష్టపోయి 35,867 పాయింట్లకు పడిపోయింది. టాప్ నిఫ్టీ కాంట్రిబ్యూటర్స్ టీసీఎస్, HUL, ఇన్ఫోసిస్ లాభఫడటంతో ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు భారీగా లాభపడ్డాయి.
మార్కెట్ మంచి లాభాల్లో ముగిసినప్పటికీ, ఉదయం నుండి కాస్త నిస్తేజంగా కనిపించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 50 సూచీ 16,500 వద్ద మద్దతు స్థాయిని కనబరిచిందని, ఈ స్థాయి కీలకమని చెబుతున్నారు. ఈ వారం మార్కెట్ 16500 స్థాయిని నిలబెట్టుకోకుంటే 16350 దిగువకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భారత జీడీపీ వృద్ధి రేటు FY22లో 7 శాతం నుండి 8 శాతంగా ఉండవచ్చునని నోమురా అంచనా వేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం నోమురా ఇండియా బిజినెస్ రిసంప్షన్ ఇండెక్స్ మొదటిసారి వందకు పైగా చేరుకుంది. ఫిబ్రవరి 2020, ఫిబ్రవరి 2021 స్థాయిల కంటే ఇది ఎక్కువగా ఉంది. 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో అత్యల్పంగా 46.5 వద్ద ఉంది. గత ఫిబ్రవరిలో 99.3, మిడ్ మేలో 60.4, ఆగస్ట్ మొదటి వారంలో 99.6గా ఉంది. ప్రస్తుతం ఇది 100 దాటి 101.2గా ఉంది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications