ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమై, చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిశాయి. నేడు ఏ దశలోను సూచీలు కిందకు పడిపోలేదు.అంతర్జాతీయ మార్కెట్ల నుండి బలహీన సంకేతాలు కనిపించినప్పటికీ దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా ఉన్నాయి. సెన్సెక్స్ దాదాపు మూడు వందలకు పైగా పాయింట్లు, నిఫ్టీ 100కు పైగా పాయింట్ల లాభాల్లో ముగిసింది. ఐటీ, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు సూచీలను లాభాల్లోకి తీసుకెళ్లాయి. నిఫ్టీ కీలక 15700 పాయింట్ల పైన ముగిసింది. అదానీ పవర్, బాటా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఉన్నాయి.

భారీ లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,143.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,143.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,957.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 358.83 (0.69%) పాయింట్లు ఎగిసి 52,300.47 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,692.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,751.25 గరిష్టాన్ని, 15,648.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 102.40 (0.65%) పాయింట్లు ఎగిసి 15,737.75 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 7.26 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.76 శాతం, ఎస్బీఐ 2.56 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.46 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 2.07 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 1.51 శాతం, బజాజ్ ఆటో 1.06 శాతం, ఐచర్ మోటార్స్ 0.88 శాతం, యూపీఎల్ 0.81 శాతం, అదానీ పోర్ట్స్ 0.69 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.65 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.60 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.95 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.21 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.40 శాతం, నిఫ్టీ ఐటీ 0.94 శాతం, నిఫ్టీ మీడియా 4.64 శాతం, నిఫ్టీ మెటల్ 1.07 శాతం, నిఫ్టీ ఫార్మా 1.38 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 2.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.34 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.90 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.11 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications