భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 26) భారీ లాభాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతేకాకుండా కీలక రంగాల సూచీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఐటీ, ఫైనాన్షియల్, రియాల్టీ రంగాలు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 50,899.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,072.61 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,620.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 379.99 (0.75%) పాయింట్లు ఎగిసి 51,017.52 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,257.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,319.90 వద్ద గరిష్టాన్ని, 15,194.95 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం 93.00 (0.61%) పాయింట్లు లాభపడి 15,301.45 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ 4.66 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.71 శాతం, ఇన్ఫోసిస్ 2.62 శాతం, గ్రాసీమ్ 2.51 శాతం, యూపీఎల్ 2.00 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.13 శాతం, JSW స్టీల్ 2.65 శాతం, హిండాల్కో 2.61 శాతం, టాటా స్టీల్ 2.09 శాతం, ఎన్టీపీసీ 1.94 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, JSW స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications