ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 3) భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో కనిపించాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పైన కనిపించింది. స్పెక్ట్రం వేలం ముగిసిన నేపథ్యంలో టెలికం షేర్లు భారీగా పుంజుకుంటాయని ముందే అంచనా వేశారు. బడ్జెట్ అనంతరం సూచీలు భారీగా ఎగిసి, ఆ తర్వాత నష్టపోయాయి. ఓ సమయంలో 52వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాల్లోకి వెళ్లింది. తిరిగి పుంజుకొని, ఇప్పుడు 51వేలు దాటి, 52వేల దిశగా వెళ్తోంది.

మార్కెట్ జంప్
సెన్సెక్స్ ఉదయం 50,738.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,539.89 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,512.84 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. రోజంతా లాభాల్లోనే ట్రేడ్ కదలాడింది. ప్రతి గంటకు అంతకంతకూ పెరిగింది. చివరకు 1,147.76 (2.28%) పాయింట్లు లాభపడి 51,444.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,064.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,273.15 వద్ద గరిష్టాన్ని, 14,995.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 326 పాయింట్లు క్షీణించి 15,245 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 5.66 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 5.25 శాతం, రిలయన్స్ 4.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.26 శాతం, యూపీఎల్ 4.10 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ 1.50 శాతం, మారుతీ సుజుకీ 1.24 శాతం, బజాజ్ ఆటో 1.09 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.93 శాతం, బీపీసీఎల్ 0.57 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్‌డీఎప్‌సీ ఉన్నాయి.

రంగాలవారీగా..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ.4 లక్షల కోట్ల వరకు పెరిగింది. మూడు రోజుల్లో రూ.10 లక్షల కోట్లు ఎగిసింది. 2021లో నాలుగోసారి సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు క్రాస్ చేసింది. మిడ్ క్యాప్ సూచీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. 43 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఆటో స్టాక్స్ నష్టపోయాయి.
నిఫ్టీ 50 సూచీలు 2.19 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 2.68 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.90 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.78 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.61 శాతం, నిఫ్టీ ఐటీ 1.86 శాతం, నిఫ్టీ మీడియా 0.63 శాతం, నిఫ్టీ మెటల్ 3.34 శాతం, నిఫ్టీ ఫార్మా 1.00 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.75 శాతం లాభపడ్డాయి. కేవలం నిఫ్టీ ఆటో 0.66 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications