ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, మే 21) అదరగొట్టాయి. కీలక రంగాల షేర్లు అన్నీ దూసుకెళ్లాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఆశలు మొలకెత్తాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే పలు కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఇది కూడా సూచీలకు కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడం కూడా సానుకూలతకు కారణం. సెన్సెక్స్ ఏకంగా దాదాపు వెయ్యి పాయింట్లు లాభపడి 50,500ను క్రాస్ చేసింది. నిఫ్టీ 15,175 పాయింట్లకు చేరుకుంది.

సూచీలు అదరగొట్టాయి
సెన్సెక్స్ 49,833.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,591.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,832.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 975.62 (1.97%) పాయింట్లు ఎగిసి 50,540.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,987.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,190.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,985.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు నిఫ్టీ 269.25 (1.81%) పాయింట్లు ఎగిసి 15,175.30 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC బ్యాంకు 4.50 శాతం, SBI 4.33 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.15 శాతం, ICICI బ్యాంకు 3.86 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.54 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.44 శాతం, ఐవోసీ 0.38 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.38 శాతం, ఐచర్ మోటార్స్ 0.33 శాతం, గ్రాసీమ్ 0.25 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.81 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.95 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.84 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.82 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.89 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.21 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.62 శాతం, నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ మీడియా 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.43 శాతం, నిఫ్టీ ఫార్మా 0.17 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.80 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.15 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.62 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications