ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. వరుసగా రెండురోజుల పాటు మార్కెట్ భారీగా నష్టపోవడంతో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనం అయింది. అయితే ఈ రోజు ఈ రెండు రోజుల నష్టంలో దాదాపు సగం పూడ్చింది. ఓ సమయంలో దాదాపు 780 పాయింట్ల లాభాల్లో కనిపించిన సెన్సెక్స్ చివరకు 560 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. నిన్న 49వేల దిగువకు చేరుకున్నప్పటికీ, నేడు తిరిగి ఈ మార్కును క్రాస్ చేసింది. దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు ప్రధానంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ లాక్ డౌన్ ఉండకపోవచ్చుననే వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.

మార్కెట్ అదుర్స్
సెన్సెక్స్ ఉదయం 48,969.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,234.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,699.91 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ప్రారంభంలోనే 500 పాయింట్లు ఎగిసింది. ఆ తర్వాత ఏ సమయంలోను తగ్గలేదు. మధ్యలో కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ నిన్నటి ముగింపు కంటే 260 పాయింట్ల పైనే ఉంది. అంటే నేటి కనిష్టం (48,670) కూడా నిన్నటి ముగింపు కంటే ఎక్కువే.
ఏ దశలోను నిన్నటి కంటే కనీసం 260 పాయింట్ల ఎగువనే ఉంది. నిఫ్టీ 14,506.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,572.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,414.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 568.38 (1.17%) పాయింట్లు ఎగిసి 49,008.50 పాయింట్ల వద్ద, నిఫ్టీ 182.40 (1.27%) పాయింట్లు లాభపడి 14,507.30 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.04 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.53 శాతం, ఏషియన్ పేయింట్స్ 4.29 శాతం, హిండాల్కో 4.19 శాతం, టాటా మోటార్స్ 3.80 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలోయూపీఎల్ 1.72 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.83 శాతం, ఐచర్ మోటార్స్ 0.77 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.53 శాతం, ఐటీసీ 0.33 శాతం నష్టపోయాయి.
బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సెన్సెక్స్‌ను భారీ లాభాల్లోకి తీసుకు వచ్చాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.27 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.99 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.24 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.94 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.57 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.82 శాతం, నిఫ్టీ ఐటీ 0.59 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 3.68 శాతం, నిఫ్టీ ఫార్మా 0.56 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.80 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.69 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.83 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications