ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 10) భారీ లాభాల్లో ముగిశాయి. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు, కరోనా విజృంభణ తగ్గకపోవడం, వ్యాక్సీన్, ఔషధాల కొరత వంటి ప్రతికూలతలు, ఔషధాల కొరత వంటి పరిణామాల నేపథ్యంలోను మార్కెట్లు జంప్ చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. ఇవి సూచీలకు అండగా నిలిచాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.73.35 వద్ద ట్రేడ్ అయింది.

సూచీలు జంప్
సెన్సెక్స్ ఉదయం 49,496.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,617.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,412.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 295.94 (0.60%) పాయింట్లు ఎగిసి 49,502.41 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,928.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,965.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,892.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 119.20 (0.80%) పాయింట్లు నష్టపోయి 14,942.35 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 7.45 శాతం, యూపీఎల్ 7.18 శాతం, హిండాల్కో 6.15 శాతం, ఐవోసీ 4.70 శాతం, టాటా మోటార్స్ 4.00 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 1.90 శాతం, బ్రిటానియా 1.37 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.96 శాతం, ఇన్ఫోసిస్ 0.96 శాతం, హీరో మోటో కార్ప్ 0.86 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, హిండాల్కో, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.80 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.46 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 1.56 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.72 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.61 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.85 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.02 శాతం, నిఫ్టీ మీడియా 2.52 శాతం, నిఫ్టీ మెటల్ 3.14 శాతం, నిఫ్టీ ఫార్మా 2.80 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.38 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.78 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.65 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications