భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 848 పాయింట్లు జంప్, నిఫ్టీ 14,900 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 17) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను తగ్గలేదు. పైగా అంతకంతకూ పెరిగి చివరకు 800 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌నుండి సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్ లాభాలు, చైనా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం వంటి పరిణామాలు కలిసి వచ్చాయి. అంతేకాదు, దేశీయంగా వరుసగా నాలుగవ రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఈరోజు పాజిటివ్ కేసులు మూడు లక్షలకు దిగువకు రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.
అపోలోలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, డీఆర్డీవో 2డీజీ అనే కరోనా మెడిసిన్‌ను విడుదల చేయడం, రెండో విడత స్పుత్నిక్-వి టీకాలు భారత్‌కు చేరడం, కొత్త వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థంగా పని చేస్తోందనే వార్తలు సెంటిమెంటును బలపరిచాయి. అలాగే గతవారం వరుస నష్టాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఆర్థికవంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. రూపాయి మారకం వ్యాల్యూ బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు లాభాలు చవిచూశాయి.

సెన్సెక్స్ నేడు 48,990.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,628.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,923.13 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకాయి. చివరకు 848.18 (1.74%) పాయింట్లు ఎగిసి 49,580.73 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,756.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,938.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,725.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 245.35 (1.67%) పాయింట్లు ఎగిసి 14,923.15 పాయింట్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications