ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(మే 18) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నేడు మరో 612 పాయింట్లు ఎగిసింది. తద్వారా రెండు రోజుల్లోనే 1460 పాయింట్లు జంప్ చేసింది. ప్రపంచ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐరోపా సూచీలు దాదాపు 0.4 శాతం లాభపడ్డాయి. అమెరికా సూచీల ఫ్యూచర్స్ కూడా లాభాల్లో ఉన్నాయి.
డౌజోన్స్ ఫ్యూచర్ 92 పాయింట్లు ఎగిసింది. జపాన్ నిక్కీ 2 శాతం, చైనా సీఎస్ఐ300 సూచీ 0.5 శాతం లాభపడ్డాయి. దీనికి తోడు దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడానికి ఉపయోగపడింది. ప్రధానంగా ఆటో స్టాక్స్ ఎగిసిపడ్డాయి.

సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్
సెన్సెక్స్ ఉదయం 49,586.68 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,313.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,959.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 612.60 (1.24%) పాయింట్లు లాభపడి 50,193.33 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,067.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,137.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,043.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.188.90 పాయింట్లు లాభపడి 15,110 పాయింట్ల వద్ద కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 5.86 శాతం, బజాజ్ ఆటో 5.25 శాతం, టైటాన్ కంపెనీ 4.83 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.76 శాతం, టాటా మోటార్స్ 3.53 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 2.42 శాతం, ఐటీసీ 1.20 శాతం, కోల్ ఇండియా 1.15 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.66 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.48 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.24 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.00 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 3.22 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.38 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.88 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.48 శాతం, నిఫ్టీ ఐటీ 0.99 శాతం, నిఫ్టీ మీడియా 1.68 శాతం, నిఫ్టీ మెటల్ 1.66 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.84 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.52 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.19 శాతం, నిఫ్టీ ఫార్మా 0.19 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.27 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications