భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, మూడ్రోజుల్లో సెన్సెక్స్ 1800 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. గత రెండు సెషన్‌లలో వరుసగా 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, నేడు మరింత ఎగిసి దాదాపు 800 పాయింట్లు పైకి చేరుకుంది. తద్వారా చాన్నాళ్లకు సెన్సెక్స్ 50,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. నిఫ్టీ 14,900 పాయింట్లకు దగ్గరగా ఉంది. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కనిపించాయి. దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం చర్యలు, వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి.

800 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 49,066.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,801.48 వద్ద గరిష్టాన్ని, 49,066.64 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 789.70 (1.61%)
పాయింట్లు ఎగిసి 49,733.84 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 48,944 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో 860 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ 14,710.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,890.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,694.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 211.50 (1.44%) పాయింట్లు ఎగిసి 14,864.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 8.55 శాతం, ఐచర్ మోటార్స్ 5.05 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.04 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.77 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా 1.76 శాతం, హిండాల్కో 1.00 శాతం, HDFC లైఫ్ 0.91 శాతం, నెస్ట్లే 0.87 శాతం, బీపీసీఎల్ 0.68 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.44 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.71 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.68 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.02 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.62 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.89 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.35 శాతం, నిఫ్టీ ఐటీ 0.57 శాతం, నిఫ్టీ మీడియా 1.05 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.58 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.99 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మెటల్ 0.30 శాతం, నిఫ్టీ ఫార్మా 0.33 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.59 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications