లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 256 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(మే 7) లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనలను తాత్కాలికంగా రద్దు చేయాలని WTOలో భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా సమ్మతించింది. దీంతో టీకాల సరఫరా మెరుగుపడే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది.

250 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,0.36.38 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 256.71 (0.52%) ఎగిసి 49,206.47 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,816.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,863.05 వద్ద గరిష్టాన్ని, 14,765.50 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 98.35 (0.67%) పాయింట్లు ఎగిసి 14,823.15.70 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 7.40 శాతం, హిండాల్కో 3.93 శాతం, JSW స్టీల్ 3.72 శాతం, అదానీ పోర్ట్స్ 3.64 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 3.18 శాతం, లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 3.69 శాతం, బజాజ్ ఆటో 1.89 శాతం, హీరో మోటో కార్ప్ 1.80 శాతం, ఐచర్ మోటార్స్ 1.07 శాతం, దివిస్ ల్యాబ్స్ 0.84 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.67 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.18 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 0.04 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.23 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.65 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.74 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.04 శాతం, నిఫ్టీ మీడియా 0.90 శాతం, నిఫ్టీ మెటల్ 4.73 శాతం, నిఫ్టీ ఫార్మా 0.00 శాతం, నిఫ్టీ మెటల్ 1.83 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.75 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.14 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.14 శాతం, నష్టపోయాయి.


Click it and Unblock the Notifications