భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, రెండ్రోజుల్లో 1000 పాయింట్లకు పైగా జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 550 పాయింట్లకు పైగా లాభపడింది. నిన్న కూడా సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ వారం వరుసగా రెండు రోజులు సూచీలు ఎగిసిపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడటం సూచీలకు అండగా నిలిచింది. ముఖ్యంగా మెటల్, టెలికాం, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు సూచీలు అదరగొట్టాయి. కరోనా విజృంభణ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడి, ఆంక్షల వంటి ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ, సూచీలు వరుసగా రెండో రోజు లాభపడటం గమనార్హం.

సెన్సెక్స్, నిఫ్టీ జంప్
సెన్సెక్స్ 48,424.08 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,009.26 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,399.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 557.63 (1.15%) పాయింట్లు ఎగిసి 48,944.14 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,493.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,667.55 గరిష్టాన్ని, 14,484.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 168.05 (1.16%) పాయింట్లు ఎగిసి 14,653.05 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 5.14 శాతం, టాటా స్టీల్ 3.93 శాతం, లార్సన్ 3.35 శాతం, దివిస్ ల్యాబ్స్ 3.29 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 3.65 శాతం, SBI లైఫ్ ఇన్సురా 1.46 శాతం, మారుతీ సుజుకీ 1.06 శాతం, నెస్ట్లే 0.54 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.53 శాతం, నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, రిలయన్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.16 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.45 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 0.69 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.43 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.16 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.99 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 0.53 శాతం, నిఫ్టీ మీడియా 1.70 శాతం, నిఫ్టీ మెటల్ 2.71 శాతం, నిఫ్టీ ఫార్మా 0.70 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.30 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.72 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.39 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications