ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 16) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా లాభాల్లో సాగిన సూచీలు చివరకు చతికిలపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభించి, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. తిరిగి కోలుకొని, 250 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లినప్పటికీ, చివరకు అతిస్వల్పంగా 28 పాయింట్ల లాభంతోముగిసింది. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

స్థిరంగా ముగిసిన మార్కెట్
సెన్సెక్స్ 48,935.74 పాయింట్లు లాభపడి, 49,089.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,694.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 28.35 (0.058%) పాయింట్లు ఎగిసి 48,832.03 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,599.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,697.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,559.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 36.40 (0.25%) పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 14,617.85 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల స్వీకరణ
గురువారం 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది విప్రో. ఇవి అంచనాలు మించడంతో ఆ కంపెనీ షేర్లు ఓ దశలో ఏకంగా 10 శాతం మేర లాభపడ్డాయి. చివరకు 9 శాతం లాభంతో ముగిసింది. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 49,089 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ ఇదే ట్రెండ్ కొనసాగించింది. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ కావడంతో ఇన్వెస్టర్లు ఇంట్రాడే లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
బీఎస్ఈ 30 స్టాక్స్‌లో ఏషియన్ పేయింట్స్ 3.05 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.43 శాతం, ఓఎన్జీసీ 2.19 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.10 శాతం, సన్ ఫార్మా 2.07 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు 1.55 శాతం, లార్సన్ 1.09 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.94 శాతం, టీసీఎస్ 0.80 శాతం, ఎస్బీఐ 0.73 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications