ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా, లాక్ డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను నమోదుచేసిన మార్కెట్లు నేడు కాస్త రికవరీ అయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు కాస్త ఊగిసలాటగా కనిపించినప్పటికీ, చివరకు మంచి లాభాలు నమోదు చేశాయి. దేశంలో కరోనా వ్యాక్సీన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలను అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇది సూచీలకు బలాన్నిచ్చాయి.

మార్కెట్ భారీ జంప్
సెన్సెక్స్ ఉదయం 47,991.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,627.43 వద్ద గరిష్టాన్ని, 47,775.32 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో 47,883 వద్ద ముగిసిన మార్కెట్లు, నేడు 600 పాయింట్లకు పైగా ఎగిసింది. 660.68 (1.38%) పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 48,544.06 పాయింట్ల వద్ద ముగిసింది. 14,364.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ 14,528.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,274.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 194.00 (1.36%) పాయింట్లు లాభపడి 14,504.80 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 7.95 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 7.02 శాతం, టాటా మోటార్స్ 5.69 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.83 శాతం, మారుతీ సుజుకీ 4.53 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4.40 శాతం, టీసీఎస్ 4.39 శాతం, టెక్ మహీంద్రా 3.65 శాతం, విప్రో 3.16 శాతం, HCL టెక్ 2.58 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.

సూచీలు పాజిటివ్‌గా...
ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి, 48,120 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేటురంగ బ్యాంకులు ICICI, HDFCల షేర్ల అండతో సూచీలు పాజిటివ్‌గా కదిలాయి. అయితే ఆశించిన దూకుడు కనిపించలేదు. కానీ మధ్యాహ్నం విదేశీ వ్యాక్సీన్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీగా లాభపడింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications