భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుండి కోలుకున్నాయి. ఈ వారంలో వరుసగా రెండు రోజుల పాటు భారీగా నష్టాలు నమోదు చేసిన సూచీలు, నేడు (గురువారం, ఏప్రిల్ 22) ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 48,000 మార్కును క్రాస్ చేసింది. నిఫ్టీ 14,400ను దాటింది. డాలర్ మారకంతో రూపాయి విలువ 74.95గా ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి.

సెన్సెక్స్ 374 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 47,501.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,143.16 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,204.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 374.87 (0.79%) పాయింట్లు లాభపడి 48,080.67 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,219.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,424.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,151.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 109.75 (0.77%) పాయింట్లు ఎగిసి 14,406.15 పాయింట్ల వద్ద ముగిసింది.

దాదాపు వెయ్యి పాయింట్లు అప్ అండ్ డౌన్
సెన్సెక్స్ నేడు దాదాపు 1000 పాయింట్ల మధ్య కదలాడింది. ఉదయం ఓ సమయంలో 500 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్, మధ్యాహ్నం ఓ సమయంలో దాదాపు 500 పాయింట్లు ఎగిసింది. చివరకు 375 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 260 పాయింట్ల మధ్య కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ICICI బ్యాంకు 3.60 శాతం, విప్రో 3.52 శాతం, JSW స్టీల్ 3.25 శాతం, టాటా స్టీల్ 3.06 శాతం, HDFC 2.64 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 2.76 శాతం, శ్రీసిమెంట్స్ 2.72 శాతం, టాటా కన్స్ 2.15 శాతం, హెచ్‌యూఎల్ 2.00 శాతం, నెస్ట్లే 1.79 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications