46,000 క్రాస్ చేసి సెన్సెక్స్ పరుగులు: రిలయన్స్ 2,000 క్రాస్, ఈ స్టాక్స్ అదుర్స్

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 9) భారీ లాభాల్లో ముగిశాయి. అంతేకాదు, రికార్డు గరిష్టాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా, సెన్సెక్స్, నిఫ్టీ మరో శిఖరాన్ని తాకాయి. నిఫ్టీ 13,500 దాటగా, సెన్సెక్స్ 46,000 మార్కును క్రాస్ చేసింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ ఎగిసిపడుతుండటంతో సూచీలు గత కొంతకాలంగా కొత్త రికార్డులను తాకుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ నేడు 1.5 శాతం మేర లాభపడింది. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

20,000 పాయింట్లు జంప్

20,000 పాయింట్లు జంప్

నేడు సెన్సెక్స్ 494.99 పాయింట్లు(1.09%) లాభపడి 46,103.50 పాయింట్ల వద్ద, నిఫ్టీ 136.10 పాయింట్లు(1.02%) లాభపడి 13,529.10 పాయింట్ల వద్ద ముగిసింది. 1604 షేర్లు లాభాల్లో, 1103 షేర్లు నష్టాల్లో ముగియగా, 133 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నెల రోజులుగా సూచీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, విదేశాల్లో పెరుగుతుండటం, ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా పెరుగుతుండటం వంటి వివిధ కారణాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అమెరికా, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. దీంతో మార్కెట్ చరిత్రలో మొదటిసారి సెన్సెక్స్ 46,000 పాయింట్లను తాకింది. మార్చిలో కరోనా కారణంగా 26వేల పాయింట్ల స్థాయికి పడిపోయిన సెన్సెక్స్, ఈ కాలంలో దాదాపు 20వేల పాయింట్లు ఎగిసింది.

రూ.2వేలు క్రాస్ చేసిన రిలయన్స్

రూ.2వేలు క్రాస్ చేసిన రిలయన్స్

నేడు టాప్ గెయినర్స్ జాబితాలో UPL 4.19 శాతం, ఏషియన్ పేయింట్స్ 3.42 శాతం, ఐవోసీ 3.19 శాతం, కొటక్ మహీంద్రా 2.71 శాతం, HDFC బ్యాంకు 2.25 శాతం లాభాల్లో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 1.91శాతం, శ్రీ సిమెంట్స్ 1.43 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.40 శాతం, విప్రో 1.15 శాతం, మారుతీ సుజుకీ 0.69 శాతం ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇన్పోసిస్ ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చాన్నాళ్లకు రూ.2000ను క్రాస్ చేసి దానిని నిలబెట్టుకుంది. నేడు రూ.2,027 వద్ద ముగిసింది.

7వ రోజు లాభాల్లో మార్కెట్లు

7వ రోజు లాభాల్లో మార్కెట్లు

మార్కెట్లు వరుసగా 7వ రోజు లాభాల్లో ముగిశాయి. 33 నిఫ్టీ స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు లాభాల్లో హెచ్‌డీఎప్‌సీ, కొటక్ బ్యాంకులు 80 శాతం కాంట్రిబ్యూట్ చేశాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.48 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.71 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.18 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.84 శాతం, నిఫ్టీ ఐటీ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 3.77 శాతం, నిఫ్టీ ఫార్మా 0.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.47 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.66 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ మెటల్ 0.53 శాతం, నిఫ్టీ ఆటో 0.05 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.02 శాతం నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+