ఫైనాన్సియల్, బ్యాంకింగ్‌లో భారీ లాభాలు: అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు, కారణాలివే

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(అక్టోబర్ 19) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 448.62 పాయింట్లు(1.12%) పాయింట్లు లాభపడి 40,431.60 వద్ద, నిఫ్టీ 110.50 పాయింట్లు(0.94%) లాభపడి 11,873 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1470 షేర్లు లాభాల్లో, 1150 షేర్లు నష్టాల్లో ముగియగా, 148 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఫార్మా, ఐటీ, ఆటో స్టాక్స్ మినహా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి.

నెస్ట్లే, ఎస్బీఐ 4 శాతం స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ మార్కెట్లను పైకి లేపాయి. వరుసగా పది రోజుల పాటు లాభాలు చూసిన మార్కెట్లు, గత గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం తిరిగి లాభాలు చూసిన మార్కెట్లు, నేడు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున

సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున

ప్రధానంగా ఫైనాన్షియల్ స్టాక్స్ కారణంగా మార్కెట్లు ఎగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ బ్యాంకు ఏకంగా 3 శాతం లాభపడింది. సెన్సెక్స్ 449 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్లు ఎగిసింది.

నిఫ్టీ బ్యాంకు 734 పాయింట్లు లాభపడి 24,267, మిడ్ క్యాప్ సూచీ 129 పాయింట్లు లాభపడి 16,916 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

ప్రభుత్వం బైబ్యాక్ ప్రణాళికల నేపథ్యంలో పీఎస్‌యూ కంపెనీలు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ 2 శాతం లాభపడగా, పీఎస్‌యూ బ్యాంకు 4 శాతం లాభపడింది.

నిఫ్టీలో టాప్ గెయినర్ ఐసీఐసీఐ బ్యాంకు. నిఫ్టీ ఏడు నెలల గరిష్టానికి సమీపంలో ఉంది.

గెయిల్, ఎస్బీఐ, ఐవోసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బీపీసీఎల్ టాప్ పీఎస్‌యూ గెయినర్స్‌గా ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభాల్లో ముగిసింది. రెండో త్రైమాసికం ఫలితాలు సానుకూలంగా ఉండటంతో ఈ స్టాక్స్ లాభపడ్డాయి.

BEML 5 శాతం లాభపడింది. SCI రెండు శాతం లాభపడింది.

అవెన్యూ సూపర్ మార్ట్స్ 6 శాతం లాభాల్లో ముగిసింది.

ఫెడరల్ బ్యాంకు 8 శాతం లాభాల్లో ముగిసింది.

తిరువనంతపురం విమానాశ్రయంపై కేరళ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ ఎగిసిపడ్డాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 24 లాభాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, నెస్ట్లే, ఎస్బీఐ, గెయిల్ ఉన్నాయి.

టాప్ 5 లాభపడిన కంపెనీల్లో మూడు ఫైనాన్షియల్ స్టాక్స్ ఉండటం గమనార్హం.

టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, సిప్లా, బజాజ్ ఆటో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

ఫైనాన్షియల్, బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండతో ఓ సమయంలో సెన్సెక్స్ 40,519 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లో లాభాల్లో ముగియడం కూడా కలిసి వచ్చింది.

రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్ 3.35 శాతం లాభపడింది.

రంగాలవారీగా చూస్తే ఆటో భారీగా నష్టపోయింది. 1.12 శాతం క్షీణించింది.

వ్యాల్యూమ్ పరంగా వరుసగా HDFC బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+