మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ ఎఫెక్ట్, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 16) లాభాల్లో ముగిశాయి. వరుసగా 10 రోజుల లాభాలకు నిన్న బ్రేక్‌పడగా, ఈరోజు మళ్లీ మార్కెట్ లాభాల బాటపట్టింది. నిన్న సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. 10 రోజుల లాభాల్లో 40 శాతం నిన్న ఒక్కరోజే నష్టపోయాయి. కానీ ఈ రోజు తేరుకున్నాయి. సెన్సెక్స్ 254.57 పాయింట్లు(0.64%) లాభపడి 39,982.98 వద్ద, నిఫ్టీ 82.10 పాయింట్లు (0.70%) ఎగిసి 11,762.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

1459 షేర్లు లాభాల్లో, 1135 షేర్లు నష్టాల్లో ముగియగా, 171 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ భారీ లాభాలు మార్కెట్లను పైకి లేపాయి.

మెటల్ అదుర్స్

మెటల్ అదుర్స్

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 24 లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ లాభాలకు ఊతమిచ్చాయి.

టాటా స్టీల్ 5.24 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.58 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.38 శాతం లాభపడింది.

హెచ్‌సీఎల్ టెక్ 3.43 శాతంతో భారీగా నష్టపోయింది.

రంగాలవారీగా మెటల్, బ్యాంకింగ్ రంగాలుభారీ లాభాలు చూశాయి. 3.70 శాతం లాభపడింది.

ఎనర్జీ సెక్టార్ 0.82 శాతం నష్టపోయింది.

వ్యాల్యూమ్ పరంగా రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్‌లో నిలిచాయి.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, బీపీసీఎల్, దివిస్ ల్యాబ్స్, హిండాల్కో ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

నిఫ్టీ బ్యాంకు 461 పాయింట్లు లాభపడి 23,533 పాయింట్లు, మిడ్ క్యాప్ సూచీలు 187 పాయింట్లు లాభపడి 16,787 పాయింట్ల వద్ద ముగిసింది.

BPCL 4 శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2 శాతం, అవెన్యూ సూపర్ మార్ట్స్ 0.5 శాతం లాభపడింది.

మైండ్ ట్రీ ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో 7 శాతం నష్టపోయింది.

ఇటీవల లిస్ట్ అయిన రూట్ మొబైల్, కెమ్‌కాన్, హాపీయెస్ట్ మైండ్స్ ఒత్తిడిలో ఉన్నాయి.

ఈ వారంలో నష్టాలు

ఈ వారంలో నష్టాలు

వరుసగా రెండు వారాల పాటు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ వారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ నిన్న భారీ నష్టాల్లోకి వెళ్ళడంతోటీసీఎస్ షేర్ 0.60 శాతం, ఇన్ఫోసిస్ 1.92 శాతం, టెక్ మహీంద్ర 1.24 శాతం, కోఫోర్జ్ 2.96 శాతం లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్ 3.48 శాతం, విప్రో 0.73 శాతం, మైండ్ ట్రీ 7 శాతం నష్టపోయాయి.ఈ వారం మొత్తం చూసుకుంటే నిఫ్టీ మెటల్ మాత్రమే లాభాల్లో ముగిసింది. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.2 శాతం నుండి 6.9 శాతం మేర క్షీణించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+