ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా భారీ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ రోజున తీవ్ర నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సోమవారం కాస్త కోలుకున్నాయి. మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం కూడా అదే పరంపర కొనసాగించాయి. ఈ రోజు సెన్సెక్స్ 353.28 (0.87%) పాయింట్లు ఎగిసి 41,142.66 వద్ద, నిఫ్టీ 109.50 (0.91%) పాయింట్లు లాభపడి 12,089.15 వద్ద క్లోజైంది. బడ్జెట్ రోజు మినహా ఆ తర్వాత సెన్సెక్స్ వరుసగా మూడు సెషన్లలో లాభాల్లో ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం రూ.71.22 వద్ద ట్రేడైంది.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, టాటా స్టీల్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటాకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్ప్, మారుతీ సుజుకీ ఉన్నాయి.

టాటా స్టీల్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, టైటాన్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్, నెస్ట్లే, మారుతీ, హీరో మోటో కార్ప్ నష్టాల్లో ముగిశాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications