సెన్సెక్స్ 109 పాయింట్లు డౌన్, 17,900 పాయింట్ల దిగువకు నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండు వారాలుగా నష్టపోతున్న మార్కెట్లు నిన్న పుంజుకున్నాయి. సెన్సెక్స్ నిన్న 831 పాయింట్లు లాభపడింది. అయితే ఈ సంతోషం ఒక్కరోజుకు మించి నిలబడలేదు. నేడు మార్కెట్లు మళ్లీ క్షీణించాయి. ఆద్యంతం ఊగిసలాటలో కొనసాగిన మార్కెట్లు. చివరి గంటలో పూర్తిగా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 60,000 పాయింట్ల దిగువకు పడిపోయినప్పటికీ, దీనిని నిలబెట్టుకోవడం కాస్త ఊరట. నిఫ్టీ కీలక 17,900 పాయింట్ల దిగువన ముగిసింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 61,138 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,929 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్ జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 60,360.61 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,421.14 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,881.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43 పాయింట్లు, 52 వారాల కనిష్టం 39,334.92 పాయింట్లు. సెన్సెక్స్ చివరకు 109.40 (0.18%) నష్టపోయి 60,029.06 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 17,970.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,012.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,847.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,604.45 పాయింట్ల, 52 వారాల కనిష్టం 12,131.85 పాయింట్లు. నిఫ్టీ చివరకు 40.70 (0.23%) పాయింట్లు నష్టపోయి 17,888.95 పాయింట్ల వద్ద ముగిసింది.

కోలుకున్నట్లే కోలుకొని...
వరుస నష్టాల నుండి సోమవారం కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. నేటి ఉదయం సూచీలు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ కాసేపటికే కిందకు పడిపోయాయి. చివరి గంట వరకు ఊగిసలాటలో కొనసాగాయి. చివరకు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 30 సూచీలోని కీలక కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఇంధనం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.31 శాతం, టైటాన్ కంపెనీ 1.98 శాతం, ఎన్టీపీసీ 1.75 శాతం, ఎస్బీఐ 1.16 శాతం, లార్సన్ 1.13 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 3.75 శాతం, గ్రాసీమ్ 2.51 శాతం, JSW స్టీల్ 2.34 శాతం, టెక్ మహీంద్రా 2.07 శాతం, హిండాల్కో 2.04 శాతం నష్టపోయాయి. మెటల్, ఫార్మా రంగాలు భారీగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications