నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: భారీగా పతనమైన రూపాయి, రూ.77 సమీపానికి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 22) స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 3.38 పాయింట్లు లేదా 0.01% నష్టపోయి 30,633.33 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్లు లేదా 0.13% నష్టపోయి 8,969.65 వద్ద ప్రారంభమయ్యాయి. 376 షేర్లు లాభాల్లో, 419 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, జీఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కాప్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, వేదాంత, ఐవోసీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి.స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 22) స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 3.38 పాయింట్లు లేదా 0.01% నష్టపోయి 30,633.33 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్లు లేదా 0.13% నష్టపోయి 8,969.65 వద్ద ప్రారంభమయ్యాయి. 376 షేర్లు లాభాల్లో, 419 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, జీఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కాప్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, వేదాంత, ఐవోసీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి.
రూపాయి ఈ రోజు మరింత బలహీనపడింది. యూఎస్ డాలర్ మారకంతో ఏకంగా 76.92కు చేరుకొని, రూ.77 సమీపానికి చేరుకుంది. నిన్న రూపాయి రూ.76.83 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 76.90 వద్ద ప్రారంభమై ఆ తర్వాత రూ.76.85 నుండి రూ.76.92 మధ్య ట్రేడ్ అయింది.

మార్కెట్లు నిన్న చమురు సెగ వల్ల నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచే నష్టాల బాటపట్టిన సూచీలకు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు పతనానికి మరింత ఆజ్యంపోశాయి. ఆర్థిక, మెటల్, ఇంధనం, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ మూడు శాతానికి పైగా కోల్పోయింది. చివరకు 1,011.29 పాయింట్లు కోల్పోయి 30,636.71 వద్ద ముగిసింది.
నిన్న సెన్సెక్స్ భారీ నష్టాల కారణంగా రూ.3.30 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.3,30,409 కోట్లు తగ్గి రూ.120.42 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మరింత బలపడటం, మరోవైపు ఈక్విటీలు కుదేలవడంతో ఇండియన్ కరెన్సీ కూడా నిన్న ఒత్తిడికి గురైంది. ఫారెక్స్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి డాలర్ మారకంతో రూపాయి 30 పైసలు కోల్పోయి 76.83 వద్దకు చేరుకుంది.


Click it and Unblock the Notifications