స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 8 వేలు దాటడం, ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకోడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మార్కెట్లు నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు పడిపోతున్నాయి.
ఉదయం గం.9:17 సమయానికి సెన్సెక్స్ 1,755.52 పాయింట్లు (6.08%) నష్టంతో 27,113.99 వద్ద, నిఫ్టీ 521.25 పాయింట్ల (6.15%) నష్టంతో 7,947.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 117 షేర్లు లాభాల్లో, 714 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి విలువ 69 పైసలు క్షీణించి 74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో రూ.74.26 వద్ద క్లోజ్ అయింది.

నిన్నటి వరకు భారీ లాభాల్లో ఉన్న యస్ బ్యాంకు షేర్ గురువారం మాత్రం నష్టపోయింది. ఉదయం గం.10.19 సమయానికి ఈ షేర్ గత సెషన్ ముగింపుతో పోలిస్తే రూ.13.80 (22.83 శాతం) పడిపోయి రూ.46.65 వద్ద ట్రేడ్ అయింది. ఒకటి రెండు షేర్లు మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో ఈ రోజు యస్ బ్యాంకు టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్మటైన్మెంట్, కోల్ ఇండియా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications