భారీ నష్టాల నుండి.. మార్కెట్‌పై అంతర్జాతీయ ప్రభావం: ఫ్యూచర్ స్టాక్స్ 10% డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు రోజుల నుండి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 14,500 దిగువకు రాగా, సెన్సెక్స్ 49,000 దిగువకు కూడా వచ్చింది. ఆ తర్వాత నష్టాల్లోనే కొనసాగినప్పటికీ, కాస్త తేరుకున్నాయి. 500 పాయింట్ల నష్టం నుండి 100 పాయింట్ల నష్టానికి దిగి వచ్చింది. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాండ్స్ ప్రతిఫలాలు పెరగడం, ఐరోపాలో మరోసారి కరోనా కేసులు పెరగడం అక్కడి సూచీల నష్టానికి కారణమయ్యాయి. ఈ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై ఉంది.

భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి
సెన్సెక్స్ నిన్న 49,216 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ప్రారంభ సెషన్లో ఏకంగా 600 పాయింట్ల మేర పతనమైంది. తర్వాత కాస్త కోలుకున్నది. 48,881.19 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 49,065.92 వద్ద గరిష్టాన్ని, 48,586.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,471.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,498.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,350.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.15 సమయానికి సెన్సెక్స్ 227.52 (0.46%) పాయింట్లు నష్టపోయి 49,010.17 వద్ద, నిఫ్టీ 67.95 (0.47%) క్షీణించి 14,489.90 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
మెటల్, ఆటో, బ్యాంకింగ్ సహా పలు రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో NTPC 1.73 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.54 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.22 శాతం, ITC 1.15 శాతం, HCL టెక్ 0.91 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.79 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.29 శాతం, లార్సన్ 2.21 శాతం, హిండాల్కో 2.17 శాతం, మారుతీ సుజుకీ 1.98 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్‌తో డీల్‌కు తాత్కాలిక బ్రేక్ పడటంతో ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ నేడు 10 శాతం మేర క్షీణించాయి.

రంగాలవారీగా
నిఫ్టీ 50 స్టాక్స్ 0.49 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.23 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.80 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.60 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.73 శాతం, నిఫ్టీ ఐటీ 0.26 శాతం, నిఫ్టీ మీడియా 1.18 శాతం, నిఫ్టీ మెటల్ 1.62 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.21 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.84 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.09 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.42 శాతం, నిఫ్టీ ఫార్మా 0.33 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications