మార్కెట్‌ను దెబ్బకొట్టిన ఐటీ, ఎఫ్ఎంసీజీ: ఆ రికార్డుతో రిలయన్స్ రూ.400 డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 6) నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో లాభాలకు బ్రేక్ పడింది. దీంతో పది రోజుల లాభాలకు నేడు బ్రేక్ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీలు షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు దాదాపు మధ్యాహ్నం వరకు అలాగే కొనసాగాయి. మధ్యాహ్నం నుండి నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో 47,970 దిగువకు పడిపోయిన సూచీలు చివరి గంటలో కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
సెన్సెక్స్ 263.72 పాయింట్లు(0.54%) క్షీణించి రూ.48,174.06 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53.20 పాయింట్లు (0.37%) క్షీణించి 14,146.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1494 షేర్లు లాభాల్లో, 1543 షేర్లు నష్టాల్లో ముగియగా, 128 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
డాలర్ మారకంతో రూపాయి 73.11 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.17 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.17 వద్ద క్లోజ్ అయింది. నేడు 73.05-73.19 మధ్య ట్రేడ్ అయింది.

రిలయన్స్ ఆల్ టైంతో రూ.400కు పైగా డౌన్
నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 4.34 శాతం, శ్రీ సిమెంట్స్ 3.89 శాతం, గెయిల్ 3.63 శాతం, హిండాల్కో 3.50 శాతం, గ్రాసీమ్ 2.42 శాతం లాభాల్లో ముగిశాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ITC 2.86 శాతం, రిలయన్స్ 1,914.25 2.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.73 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.54 శాతం, HUL 1.36 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ భారీగా పతనమైంది. ఏకంగా 2.57 శాతం మేర పడిపోయి రూ.1,950 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.1910 దిగువకు వచ్చింది. రిలయన్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.400కు పైగా పడిపోయింది.

ఐటీ, ఎఫ్ఎంసీజీ భారీగా డౌన్
నిఫ్టీ 50 0.38 శాతం నష్టపోగా, మిడ్ క్యాప్ సూచీ 0.82 శాతం లాభపడింది.
నిఫ్టీ బ్యాంకు 0.24 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.16 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.09 శాతం, నిఫ్టీ మీడియా 0.25 శాతం, నిఫ్టీ మెటల్ 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.71 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.19 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.69 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.13 శాతం, నిఫ్టీ ఐటీ 1.36 శాతం, నిఫ్టీ ఫార్మా 0.37 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.32 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications