కొత్త ఏడాదిలో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: కొత్త సంవత్సరం ఆరంభం రోజున స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈ ఏడాది (2020)లో కొద్దిగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సూచీలు బాగానే రాణిస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 119.86 (0.29%) లాభంతో 413,73.60 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 33.90 (0.28%) లాభంతో 12202.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించించింది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ ఉదయం కంటే తగ్గింది. మధ్యాహ్నం గం.1.41 సమయానికి సెన్సెక్స్ +33.95 (0.082%) లాభంతో 41,287.69 వద్ద, నిఫ్టీ 10.65 (0.088%) లాభంతో 12,179.10 వద్ద ట్రేడ్ అయింది.

మధ్యాహ్నం 12 గంటల సమయానికి పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టి, ఎన్టీపీసీ, టీసీఎస్, హిందూస్తాన్ యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సన్ ఫార్మా, ఆసియా నెట్, హీరో మోటో కార్ప్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నెస్ట్లే, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, మారుతీ, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications