భారీ నష్టాల నుండి భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి వెళ్లి, మధ్యాహ్నం వరకు నష్టాల్లో ఊగిసలాటలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. అప్పటి నుండి ఏ దశలోను తగ్గలేదు. అంతకంతకూ పైకెగిసి నేడు 52,973.07 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత అతి స్వల్పంగా తగ్గినప్పటికీ భారీ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్ల లాభాల్లో ముగిసింది. మెటల్, బ్యాంకింగ్ రంగాల మద్దతుతో పాటు టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వంటి కీలక కంపెనీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడాయి.

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 52,877.16 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,973.07 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,614.49 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,839.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,870.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,772.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 226.04 (0.43%) పాయింట్లు లాభపడి 52,925.04 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69.90 (0.44%) పాయింట్లు లాభపడి 15,860.35 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 4.68 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.00 శాతం, ఎస్బీఐ 2.78 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.36 శాతం, హిండాల్కో 1.86 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 2.28 శాతం, HUL 1.67, ఎన్టీపీసీ 1.65 శాతం, టైటాన్ కంపెనీ 1.52 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.29 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.44 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.70 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.83 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.54 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.56 శాతం, నిఫ్టీ మీడియా 0.07 శాతం, నిఫ్టీ మెటల్ 2.61 శాతం, నిఫ్టీ ఫార్మా 0.73 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.64 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.29 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.37 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.59, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.65 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications