For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, ఊగిసలాటలో ఆసియా మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఊగిసలాటలో కనిపించి, ఆ తర్వాత స్థిరమైన లాభాలు చూశాయి. నిన్న మార్కెట్‌ను కరోనా భయాలు కమ్ముకోవడంతో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి 29 పైసలు బలపడింది రూ.75.66 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు మార్కెట్ ఉదయం గం.9.16 సమయానికి లాభాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 116.63 పాయింట్లు లేదా 0.38% ఎగిసి 30,725.93 వద్ద, నిఫ్టీ 31.50 పాయింట్లు లేదా 0.35% పెరిగి 9,060.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 461 షేర్లు లాభాల్లో, 186 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 42 షేర్లలో ఉదయం మార్పు లేదు.

'ఫ్యామిలీ నుండి విడిపోతున్నారు, మీ ఉద్యోగాలు తొలగిస్తున్నందుకు క్షమించండి''ఫ్యామిలీ నుండి విడిపోతున్నారు, మీ ఉద్యోగాలు తొలగిస్తున్నందుకు క్షమించండి'

మార్కెట్ జోరు, బలపడిన రూపాయి

మార్కెట్ జోరు, బలపడిన రూపాయి

ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత స్వల్పంగా నష్టపోయింది. అనంతరం మధ్యాహ్నం గం.11.47 సమయానికి 265 పాయింట్లకు పైగా పెరిగింది. డాలర్ మారకంతో రూపాయి 75.60 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ 2 శాతం ఎగిసింది. బ్యాంక్ నిఫ్టీతో పాటు ఐటీ, మెటల్, రియాల్టీ సహా దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు కూడా ఊగిసలాటలో

ఆసియా మార్కెట్లు కూడా ఊగిసలాటలో

అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఉదయం 0.46 శాతం నష్టపోయింది. జపాన్ నిక్కీ, చైనా మార్కెట్లు కూడా కొద్ది నష్టాల్లో ఉన్నాయి. కరోనా వైరస్ మళ్లీ విజృంభించడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇండియా మార్కెట్ పుంజుకుంటుంది

ఇండియా మార్కెట్ పుంజుకుంటుంది

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు జేపీ మోర్గాన్ భారత మార్కెట్ పైన తన అంచనాలు వెల్లడించింది. భారత మార్కెట్ రెండో ఏడాదిలో చాలా బలంగా పుంజుకుంటుందని అంచనా వేసింది. మొదటి ఆర్థిక సంవత్సరంలో ఇండియా పరిస్థితి దారుణంగా ఉంటుందని, రెండో క్వార్టర్‌లో జీడీపీ 35 శాతం వరకు తగ్గుతుందని, కానీ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మాత్రం బలంగా పుంజుకుంటుందని తెలిపింది. భారత్‌లో ఉత్పత్తి-డిమాండ్ క్రమంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

English summary

భారీ లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు, ఊగిసలాటలో ఆసియా మార్కెట్లు | Nifty around 9,100, Sensex jumps 200 points

Benchmark indices are trading higher amid volatile trade with Nifty around 9100 level. Among sectors, Bank Nifty rose over 2 percent followed by the IT, metal and Realty index.
Story first published: Wednesday, May 27, 2020, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X