Russia Ukraine crisis: భారీ నష్టాల నుండి స్వల్పనష్టాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు(ఫిబ్రవరి 28) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో మార్కెట్లు కుప్పకూలాయి. అయితే అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా దూకుడుకు కళ్లెం పడుతుందనే ఉద్దేశ్యంతో గతవారం చివరలో మార్కెట్ భారీ నష్టాల నుండి తప్పించుకుంది. అయితే రష్యాను స్విఫ్ట్ నుండి తప్పించిన వార్తల నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.

ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం

ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం

రష్యా ప్రారంభించిన యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఓ వైపు శాంతిచర్చలు అంటున్నప్పటికీ రష్యా అణ్వస్త్ర సంసిద్ధత కలవరాన్ని కలిగిస్తోంది. రష్యాపై యూరోపియన్ దేశాల స్విఫ్ట్ బహిష్కరణ వంటి కఠిన ఆంక్షలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సరఫరా భయాలు కూడా కమ్ముకున్నాయి. ఇది అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా వివిధ దేశాలు వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాలు

భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాలు

సెన్సెక్స్ నేడు ఉదయం గం.11.00 సమయానికి 364.47 (0.65%) పాయింట్లు నష్టపోయి 55,532.30 పాయింట్ల వద్ద, నిఫ్టీ 211.10 (1.27%) పాయింట్లు క్షీణించి 16,589 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 55,329.46 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,536.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,833.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాలు తగ్గాయి. ఓ సమయంలో 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ గం.11.05 సమయానికి 275 పాయింట్ల నష్టాల్లోకి తగ్గింది. నిఫ్టీ కూడా ఉదయం 300 పాయింట్లు పతనమైనప్పటికీ, ఈ వార్త రాసే సమయానికి 68 పాయింట్ల నష్టాల్లోకి వచ్చింది.

రూపాయి బలహీనం

రూపాయి బలహీనం

వివిధ రంగాల విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. మెటల్ రంగం లాభాల్లో ఉంది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి 40 పైసలు క్షీణించి 75.73 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 6.27 శాతం ఎగిసి 97.33 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 5.24 శాతం ఎగిసి 103.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+